కీర్తన 23 (భాగం 1)

                  కీర్తన 23 (భాగం 1)

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — కీర్తనలు 23:1

నిశ్చయం: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

I. మంచి కాపరి నందు విశ్వాసము మరియు స్వరమును వినుట

  • 1) గొర్రెల కొరకు ప్రాణము పెట్టు మంచి కాపరిని విశ్వసించుట 
  •  యోహా 10:11; యోహా 10:14; యోహా 20:17
  • 2) కాపరి యొక్క దైవిక స్వరమును విని ఆయనను వెంబడించుట 
  •  యోహా 10:16; యోహా 10:4
  • 3) దేవుని వాక్యమును వినుట ద్వారా ఆత్మీయ విశ్వాసమును పొందుట 
  •  రోమా 10:17

II. దైవిక భరోసా, హృదయ సంతృప్తి మరియు ఆత్మీయ పోరాటము

  • 1) యథార్థమైన హృదయముతో సంపూర్ణ విశ్వాసము కలిగి దేవుని సహాయమును వెదకుట కీర్త 17:15-37; కీర్త 37:23-25; కీర్త 34:7; మత్త 7:7-8; 2పేతు 1:3-4; హెబ్రీ 10:22
  • 2) లోక ఆశల వెనుక పరిగెత్తక దేవుని ఐశ్వర్యము చొప్పున సంతృప్తి కలిగియుండుట 
  •  ఫిలి 4:19; లూకా 15:13
  • 3) విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుచు ఓర్పును కలిగియుండుట 
  •  1తిమో 6:12; యాకో 1:4; యూదా 3

III. సమాధానకర్తయగు క్రీస్తు ద్వారా కలిగే శాంతి మరియు జీవము

  • 1) తుఫానుల వంటి శోధనలను నిశ్శబ్దపరచు సమాధానకర్తను కలిగియుండుట 
  •  కీర్త 46:3; మార్కు 4:39; యెష 9:6
  • 2) సమాధానపరచువారై ఆత్మ ఫలములతో సమాధానమును వెంబడించుట 
  •  మత్త 5:9; రోమా 14:19; 1పేతు 3:10-12; రోమా 12:18; గల 5:22-23
  • 3) సజీవమైన దేవుని వాక్యము ద్వారా పునరుత్థానమును నిత్యజీవమును పొందుట యోహా 6:63; యోహా 11:25; హెబ్రీ 4:12; రోమా 8:11; యోహా 2:19

ముగింపు: యెహోవాను మన కాపరిగా కలిగియున్నప్పుడు ఆత్మీయంగాను, శారీరకంగాను మనకు ఎలాంటి లేమి కలుగదు గనుక, ఆయన స్వరమునకు లోబడి సంపూర్ణ శాంతిని, జీవమును పొందుకుందాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు