నోటిని అదుపుచేయడం) - పార్ట్ 2
నోటిని అదుపుచేయడం – పార్ట్ 2
మూలవాక్యము: యాకోబు 3:2
ముఖ్య భావము: క్రైస్తవుని హృదయ స్థితి అతని మాటలలో కనిపిస్తుంది. పరిశుద్ధమైన హృదయము దేవునికి మహిమ కలిగించే మాటలను ఉత్పత్తి చేస్తుంది.
I. హృదయము మరియు మాటల సంబంధము
- A. విశ్వాసము క్రియలలో కనబడాలి — యాకో 1:22; యాకో 2:14; 2 కొరి 10:5
- B. హృదయ సమృద్ధిని బట్టే నోరు మాట్లాడుతుంది — మత్త 12:34-37
II. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలి
- A. నోటికి కావలి ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి — సామె 10:20; కీర్త 141:3; సామె 21:23
- B. తక్కువగా, నిదానముగా మరియు సమయోచితముగా మాట్లాడాలి — సామె 10:19; సామె 13:3; సామె 25:11; యాకో 1:19
III. కోపమును జయించి ఆశీర్వాదకరమైన మాటలు పలకాలి
- A. మృదువైన మాటలు కోపమును చల్లార్చును — సామె 15:1; సామె 16:32; ఎఫె 4:26
- B. దయతో, కృపతో మరియు ఆత్మీయ ప్రయోజనమిచ్చే మాటలు పలకాలి — కొల 4:6; సామె 16:24; ఎఫె 4:29
IV. నాలుకను అదుపులో ఉంచుకోవాలి
- A. హృదయమును కాపాడుకొని నాలుకను అదుపు చేయాలి — ప్రస 5:6; కీర్త 19:14; యాకో 3:6; సామె 4:23; మత్త 15:18
- B. ప్రతి మాట దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి — ఫిలి 4:8; యాకో 3:10; కీర్త 39:1; కొల 3:17
ముగింపు
- A. పరిశుద్ధమైన హృదయము పరిశుద్ధమైన మాటలను ఉత్పత్తి చేస్తుంది.
- B. నాలుకను అదుపులో ఉంచినవాడు తన జీవితమును కాపాడుకొనును.
- C. మన ప్రతి మాట దేవునికి మహిమ కలిగించే విధంగా ఉండాలి.
ఆత్మీయ ప్రశ్న: నీ నోటి నుండి వచ్చే మాటలు దేవుని నామానికి మహిమను తెచ్చేవిగా ఉన్నాయా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి