దేవుడు ద్వేషించే ఏడు విషయాలు
దేవుడు ద్వేషించే ఏడు విషయాలు
మూల వాక్యం: సామెతలు 6:16-19 — "ยెహోవా ద్వేషించునవి ఆరు కలవు ఆయనకు అసహ్యములైనవి ఏడు."
పరిచయం: దేవుని దృష్టికి అసహ్యమైన పాప క్రియలను విడనాడి, ఆయనకు ఇష్టులుగా ఎలా జీవించాలో లేఖనాల ద్వారా గ్రహిద్దాం.
I. అహంకార దృష్టి మరియు అసత్య వచనములు
- A. అహంకార కన్నులు, నెబుకద్నెజరు మరియు పరిసయ్యుని గర్వము. సామె 6:17; దాని 4:29-33; లూకా 18:9-14; లూకా 7:36-50
- B. సర్పము యొక్క వంకర మాటలు, అబద్ధమాడువారి నాశనము. సామె 6:12-15; ఆది 3:1-6; కీర్త 5:6; కీర్త 120:2; సామె 12:19; హోషే 4:1-3
- C. అననీయ సప్పీరా మోసము, అబద్ధికులకు అగ్నిగుండపు శిక్ష. అపొ 5:1-11; ఎఫె 4:25; ప్రక 21:8, 27
II. నరహత్య మరియు దుష్ట తలంపులు
- A. నరహత్య నిషేధము, కయీను మరియు మనష్షే చేసిన రక్తపాతము. నిర్గ 20:13; మత్త 19:18; 1 రాజు 21:1, 13-16; ఆది 4:8; ఆది 9:6; 2 రాజు 21:6; 24:3-4
- B. హృదయపు దురాలోచనలు, దేవద్వేషుల కల్పిత క్రియలు. సామె 6:18; ఆది 6:5; రోమా 1:30
III. కీడుకు త్వరపడుట మరియు అబద్ధ సాక్ష్యము
- A. పాపుల ప్రేరేపణ, కీడు చేయుటకు త్వరపడే నడకలు. సామె 6:18; సామె 1:10-19; కీర్త 119:101; నిర్గ 23:2
- B. లేనివాటిని పలికే అబద్ధ సాక్ష్యము, బొంకులాడే పెదవులు. సామె 6:19; 1 రాజు 21:9; సామె 14:5, 25; 19:5, 9
IV. సమాధాన భంగము మరియు ఐక్యత
- A. అన్నదమ్ములలో జగడములు, సమాధాన పరచువారి ధన్యత. సామె 6:19; కీర్త 133:1; మత్త 5:9; మత్త 10:34-38
- B. దేవుని రాజ్యపు నీతి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఎఫె 4:1-3; కొల 3:15; రోమా 14:17; ఎఫె 2:14-16
V. ముగింపు మరియు ఆత్మీయ హెచ్చరిక
- A. యెహోవా ద్వేషించు ఆరు విషయములు, అసహ్యమైన ఏడు క్రియలు. సామె 6:16-19
- B. దైవిక తీర్పు, అట్టి వాటిని చేయువారికి మరణశిక్ష. రోమా 1:32
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి