బైబిల్ మనకు ఏమి చేయగలదు

         బైబిల్ మనకు ఏమి చేయగలదు

ఆధార వాక్యము: 2 తిమో 3:16-17

I. పరిచయం

  • A. దైవావేశము వలన కలిగిన లేఖనములు సజీవమైనవి. 2 తిమో 3:16; హెబ్రీ 4:12; యోహా 17:17

II. దేవునిని మరియు యేసుక్రీస్తును పరిచయం చేస్తుంది

  • A. దేవుని గూఢమైన సంగతులను, దైవనీతిని బయలుపరుస్తుంది. రోమా 1:16-17; 1 కొరి 2:9-13; యోహా 14:8-10
  • B. యేసే క్రీస్తు అని నిరూపించి మనకు పరిచయం చేస్తుంది. రోమా 1:1-4; యోహా 5:39; 20:30-31; హెబ్రీ 1:1-2; అపొ 1:3
  • C. క్రీస్తును ఎరుగుట శ్రేష్ఠమనియు, ఆయనందే రక్షణ అనియు తెలుపుతుంది. అపొ 4:12; ఫిలి 3:8-10

III. రక్షణార్థ జ్ఞానమిచ్చి హృదయాన్ని ఒప్పిస్తుంది

  • A. మన ఆత్మల రక్షణకు కావలసిన దైవిక జ్ఞానమును ఇస్తుంది. 2 తిమో 3:15; యాకో 1:21; 2 పేతు 1:3
  • B. వాక్యమనే రెండంచుల ఖడ్గముతో హృదయాలను చీల్చగలదు. హెబ్రీ 4:12; అపొ 2:37

IV. జీవితాన్ని సరిచేసి ఆత్మీయంగా బలపరుస్తుంది

  • A. నూతన సృష్టిగా మార్చి, బాప్తిస్మము ద్వారా పాపములను కడిగివేస్తుంది. 2 కొరి 5:17; రోమా 6:3-4; 1 పేతు 3:21; అపొ 22:16
  • B. తప్పులను దిద్ది, దైవజనుడిని ప్రతి సత్కార్యమునకు సిద్ధపరుస్తుంది. 2 తిమో 3:16-17
  • C. వాక్యోపదేశము ద్వారా వివేకమిచ్చి ఆత్మీయంగా బలపరుస్తుంది. అపొ 20:32; 21:10-13; కీర్త 119:104

V. తప్పులను బయటపెట్టి సత్యమందు నిలబెడుతుంది

  • A. తప్పుడు బోధలను గుర్తించి ఆత్మలను పరీక్షించేలా చేస్తుంది. 1 యోహా 4:1; 2 యోహా 9-11
  • B. అబద్ధమును నిర్మూలించి సత్యము ద్వారా స్వాతంత్ర్యమిస్తుంది. యోహా 8:32; 2 థెస్స 2:10-12

VI. ముగింపు

  • A. సజీవమైన దేవుని వాక్యమునకు లోబడి, ఆత్మీయ స్వేచ్ఛను పొంది నడుచుకుందాం. 2 తిమో 3:16-17; యోహా 8:32; హెబ్రీ 4:12

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు