పడిపోకుండా జాగ్రత్తగా ఉండు
పడిపోకుండా జాగ్రత్తగా ఉండు
పాఠ్యభాగము: 1 కొరిం 10:12
పరిచయం: క్రైస్తవ జీవితంలో పడిపోకుండా నిలిచియుండుటకు విశ్వాసం, జాగ్రత్త అవసరం.
I. ఇశ్రాయేలు మనకు హెచ్చరికగా నిలిచిన ఉదాహరణ
- A. దేవుడు ఇశ్రాయేలును తన ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొనెను నిర్గ 19:4-6; ద్వితీ 7:6-8
- B. వారికి వాగ్దానమును అనుగ్రహించి అరణ్యములో నడిపించెను యెహో 1:2; నిర్గ 1:11
II. విశ్వాసులు కూడా పడిపోయే ప్రమాదం ఉంది
- A. అవిశ్వాసము, అవిధేయత ఆత్మీయ పతనానికి దారితీస్తాయి
- హెబ్రీ 3:12; హెబ్రీ 4:11; 1 కొరిం 10:12
- B. ఉద్దేశపూర్వక పాపము వలన కృపను విడిచిపెట్టుదురు హెబ్రీ 10:26-29; గల 5:4
- C. సత్యమును విడిచిపెట్టి విశ్వాసము నుండి తొలగిపోవుదురు
- 2 పేతు 3:14-15; 1 తిమో 4:1-3; 1 తిమో 6:10,21; 2 తిమో 2:18
III. పడిపోయినవానికి కలిగే परिణామాలు
- A. దేవుని కృపను, ఆయన అనుగ్రహమును కోల్పోవుదురు 1 సమూ 2:30; హెబ్రీ 3:12
- B. ఆత్మీయంగా గ్రుడ్డివారై భక్తిహీనతలో పడిపోవుదురు 2 తిమో 3:1-5; 2 పేతు 1:8-9
IV. పతనము ఎంత తీవ్రమైనదో
- A. తిరిగి రావడం అత్యంత కష్టమయ్యే స్థితికి చేరుదురు హెబ్రీ 6:4-6
- B. అలాంటివారు దేవుని భయంకరమైన తీర్పును ఎదుర్కొనవలెను హెబ్రీ 10:26-29
V. పడిపోవడానికి ప్రధాన కారణాలు
- A. హృదయ కాఠిన్యము మరియు ఆత్మీయ అపరిపక్వత
- హెబ్రీ 3:12-14; హెబ్రీ 5:12-14
- B. ప్రార్థన, మేలుచేయుట, సంఘకూడికలను నిర్లక్ష్యం చేయుట
- గల 6:9-10; 1 థెస్స 5:17; హెబ్రీ 10:24-25
- C. లోకసంబంధమైన సాకులు చెపుతూ పూర్వ ఉదాహరణలు మరచుట
- లూకా 14:15-24; 1 కొరిం 10:6-11; రోమా 12:15
VI. పతనానికి దారితీసే ఇతర ప్రమాదాలు
- A. చెడు సాంగత్యము మరియు అబద్ధ బోధలను నమ్ముట 1 కొరిం 15:33; 2 తిమో 2:16-17; 2 పేతు 2:1-3; కొలొ 2:8
- B. ధనాపేక్ష, శారీరక ఆశలు మరియు లోక ప్రేమానుసారము నడుచుట
- 1 తిమో 6:9-10; రోమా 6:12-13; ఎఫె 4:17-19; గల 5:19-21; 2 తిమో 4:10
- C. మానవ జ్ఞానమును దేవుని వాక్యముకంటే గొప్పగా ఎంచుట 1 కొరిం 1:19-20
ముగింపు: దేవుని వాక్యమందు స్థిరముగా ఉంటూ, అంతము వరకు జాగ్రత్తగా జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: మీరు నిర్లక్ష్యంగా ఉన్నారా? లేక పడిపోకుండా దేవుని వాక్యములో జాగ్రత్త పడుతున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి