దైవిక సంకల్పం (ఎనిమిదవ భాగం)

                  దైవిక సంకల్పం – 8

మూల వాక్యం: కీర్తన 73:1-17


I. దేవుడు మరియు దుష్టత్వం

  • A. ఆసాపు కూడా ఈ ప్రశ్నతో పోరాడెను
    కీర్త 73:1-17
  • B. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడువడు
    మత్త 5:45; హెబ్రీ 13:5-6; రోమా 8:28
  • C. దేవుని న్యాయం చివరికి ప్రత్యక్షమగును
    కీర్త 73:17-20; రోమా 2:6-11

II. దేవుని సంకల్పాన్ని విశ్వాసముతో అర్థం చేసుకోవాలి

  • A. దేవుని కార్యములు సంపూర్ణంగా మనకు గ్రహింపబడవు
    ప్రసం 3:11; యెష 55:8-9
  • B. చూపుచేత కాదు, విశ్వాసముచేత నడుచుకోవాలి
    2 కొరిం 5:7; హెబ్రీ 11:6
  • C. దేవుని జ్ఞానంపై నమ్మకం ఉంచాలి
    సామె 3:5-6; రోమా 11:33

III. చెడు యొక్క మూలాన్ని తెలుసుకోవాలి

  • A. సాతాను చెడుకు కారణకర్త, అయితే దేవుని పరిమితులలోనే పనిచేస్తాడు
    యోహా 8:44; 1 యోహా 3:8; యోబు 1:12; 2:6
  • B. క్రీస్తు సాతాను బంధనముల నుండి విమోచన కలిగించును
    లూకా 13:10-17; కొలొ 1:13-14; హెబ్రీ 2:14-15

IV. దేవుడు బాధను అనుమతించుటకు కారణాలు

  • A. అవిధేయత మరియు పాపము తీర్పును తెస్తాయి
    ఆమో 3:6; రోమా 1:18-32; గల 6:7-9
  • B. విశ్వాసులు కూడా నీతి నిమిత్తము శ్రమలను అనుభవిస్తారు
    మార్కు 6:18-27; అపొ 7:54-60; 8:1-4; 1 పేతు 4:12-19; 2 తిమో 3:12
  • C. మన నిర్ణయాలకు కూడా పర్యవసానాలు ఉంటాయి
    యెహో 24:15; అపొ 20:9

V. బాధ యొక్క ఆత్మీయ ప్రయోజనాలు

  • A. బాధ విశ్వాసాన్ని పరిపక్వపరచి సహనాన్ని కలిగిస్తుంది
    హెబ్రీ 12:6-11; 1 పేతు 1:6-9; రోమా 5:3-5; యాకో 1:2-4
  • B. బాధ ద్వారా ఇతరులను ఆదరించే సేవకు సిద్ధపడతాము
    2 కొరిం 1:3-6; యోబు 1:1; యోహా 9:1-3
  • C. రాబోవు మహిమపై నిరీక్షణ బలపడుతుంది
    రోమా 8:18; 2 కొరిం 4:16–5:1

VI. దేవుని సంకల్పములో స్థిరంగా నిలుద్దాం

  • A. దేవుని న్యాయాన్ని గుర్తించి ఆయనకు భయపడాలి
    కీర్త 73:17-28; ప్రస 12:13-14
  • B. ప్రతి పరిస్థితిలో దేవునిపై విశ్వాసముతో నిలిచియుండాలి
    రోమా 8:28; హెబ్రీ 10:35-39

ఆత్మీయ ప్రశ్న

దేవుని దైవిక సంకల్పాన్ని విశ్వసించి, బాధలలో కూడా ఆయన చిత్తానుసారంగా విశ్వాసముతో నడుచుకుంటున్నావా?

కామెంట్‌లు