క్రైస్తవుని పోరాటం

           క్రైస్తవుని పోరాటం

మూల వాక్యం: 1 కొరింథీయులకు 16:13 — "మెలకువగా ఉండుడి, విశ్వాసమందు స్థిరులై యుండుడి, మగవారివలె ప్రవర్తించుడి, బలవంతులై యుండుడి."

ముఖ్య భావము: క్రైస్తవ జీవితం ఒక ఆత్మీయ పోరాటము. శోధనలు, అబద్ధబోధలు, సాతాను తంత్రములను ఎదిరిస్తూ దేవుని వాక్యములో స్థిరంగా నిలవాలి.

I. మెలకువగా ఉండండి

A. శోధనలను జయించుటకు ఆత్మీయ మెలకువ అవసరం
మత్తయి 26:41; రోమా 13:11; 1 కొరిం 15:34; ఎఫెసీ 5:14; 1 పేతురు 5:8

B. అబద్ధబోధలు మరియు సాతాను తంత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
మత్తయి 7:15; అపొ.కా. 20:28-29; 2 పేతురు 2:1-2; మత్తయి 13:24-25; 2 కొరిం 2:11

C. గత ఉదాహరణల నుండి హెచ్చరిక నేర్చుకోవాలి
ఆది 3:1-24; 1 తిమోతి 2:13-14; 1 శమూయేలు 3:13-14; న్యాయాధిపతులు 2:6-10

II. యుద్ధానికి సిద్ధంగా ఉండండి

A. విశ్వాసములో స్థిరపడి సత్యమును కాపాడాలి
హెబ్రీ 3:12-14; యూదా 1:3; అపొ.కా. 13:1-52; 2 యోహాను 1:9; మత్తయి 15:8-9

B. వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలవాలి
న్యాయాధిపతులు 7:1-25; హెబ్రీ 10:38-39; 2 తిమోతి 4:10; గలతీ 2:4-5; ద్వితీయోపదేశకాండము 31:6; 1 శమూయేలు 17:32

C. రాజీపడకుండా విశ్వాస పోరాటము చేయాలి
నిర్గమకాండము 8:25-27; నిర్గమకాండము 10:10; నిర్గమకాండము 10:24; నెహెమ్యా 6:3-5; 1 పేతురు 5:8-9; యాకోబు 4:7; ప్రకటన 2:10

D. దేవుని ఆయుధములతో సిద్ధపడాలి
ఎఫెసీ 6:10-18; 1 పేతురు 3:15; రోమా 1:16; 2 తిమోతి 2:15; 1 తిమోతి 6:12; ఫిలిప్పీయులకు 1:15-17

III. మగవారిలా ప్రవర్తించండి

A. ఆత్మీయ పరిణతి కలిగినవారై ఉండాలి
1 కొరిం 14:20; ఎఫెసీ 4:14; ఎఫెసీ 5:17; హెబ్రీ 5:12

B. ధైర్యంగా విశ్వాసములో ముందుకు సాగాలి
యెహోషువ 1:7-9; దానియేలు 3:14-18; ఫిలిప్పీయులకు 3:13; అపొ.కా. 21:12-13

C. అంతరంగములో బలపడి పరిశుద్ధ జీవితము జీవించాలి
ఎఫెసీ 4:5; 1 తిమోతి 2:15; 1 తిమోతి 4:7-8; ఎఫెసీ 3:16; ఎఫెసీ 4:22-24; 2 కొరిం 10:3-5; ఆది 39:9-10

IV. ముగింపు

A. విశ్వాసములో స్థిరులై అంతము వరకు పోరాడుదాం
1 కొరింథీయులకు 16:13

ఆత్మీయ ప్రశ్న:
మీరు ప్రతి రోజూ దేవుని వాక్యమును ఆయుధముగా ధరించి, సాతాను తంత్రాలను ఎదిరిస్తూ విశ్వాసములో స్థిరంగా పోరాడుతున్నారా?

కామెంట్‌లు