ఈ ప్రపంచం మన ఇల్లు కాదు

          ఈ ప్రపంచం మన ఇల్లు కాదు

పాఠ్యభాగము: "నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు... మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్లుచున్నాను." —యోహా 14:2

I. ఈ లోకం శాశ్వత గృహం కాదు

  • ఎ) మరణము మరియు దైవిక తీర్పు తప్పదు (హెబ్రీ 9:27-28; ఫిలి 3:20)
  • B) లోక శ్రమలు, భౌతిక ఆనందములు తాత్కాలికమే (కీర్త 38:17; ప్రస 11:7-8)

II. ఈ ప్రపంచం హృదయ తృప్తి ఇవ్వదు

  • ఎ) భక్తులు లోక శ్రమల నుండి విముక్తి కోరుకున్నారు (యోబు 7:11-18; కీర్త 55:4-8)
  • B) చనిపోయి క్రీస్తుతో ఉండుట శ్రేష్ఠమని పౌలు ఆశించెను పిలిప్పీ 1:21-26)

III. స్వర్గమే మన నిజమైన ఇల్లు

  • ఎ) పరలోకమందు నిత్య గృహము సిద్ధమౌతున్నది (యోహా 14:1-3; 2 కోరి 5:1)
  • B) ఆ పరిశుద్ధ స్థల మందు మరణము, బాధలు ఉండవు (ప్రక 21:4; లూకా 20:34-36)

IV. క్రైస్తవుని దృష్టి పరలోకంపై

  • ఎ) తాత్కాలిక వాటిని కాక నిత్యత్వమునే చూడాలి (2 కోరి 4:18; కొల 3:1)
  • B) తీర్పు దినమును ఎరిగి ఇప్పుడే సిద్ధపడాలి (2 కోరి 5:10)

ముగింపు: మనము ఈ లోకములో యాత్రికులము మాత్రమే గనుక, పరలోక నివాసము కొరకు నిరీక్షణ కలిగి సిద్ధపడాలి.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ హృదయము తాత్కాలికమైన ఈ లోకముపై ఉందా? లేక శాశ్వతమైన పరలోకముపై ఉన్నదా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు