ప్రభువునందు విశ్రాంతి

               ప్రభువునందు విశ్రాంతి
మూలవాక్యము: సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును — మత్తయి 11:28

I. పాత నిబంధన దినములలో విశ్రాంతి
A. సృష్టి కార్యముల నుండి దేవుని విశ్రాంతి 
— ఆది 2:1-4; హెబ్రీ 4:11.
B. యూదుల విశ్రాంతి దినమైన సబ్బాతు 
— నిర్గమ 20:8; కొలొస్స 2:16.
C. కనాను దేశములో ఇశ్రాయేలీయుల విశ్రాంతి 
— హెబ్రీ 4:8-9.
D. పూర్వ లేఖనముల ద్వారా బోధ — రోమా 15:4.

II. ఈ విశ్రాంతి ఎవరికి వాగ్దానం చేయబడలేదు?
A. అరణ్యములో రాలిన దుష్టులకు లేదు
 — సంఖ్య 26:63-65; హెబ్రీ 3:18.
B. మృగమును ఆరాధించేవారికి విశ్రాంతి ఉండదు 
— ప్రకటన 14:11.
C. అవిధేయులైన అవిశ్వాసులకు లేదు — హెబ్రీ 4:8-9.

III. ఈ విశ్రాంతి ఎవరికి వాగ్దానం చేయబడింది?
A. దేవుని యందు భయభక్తులు గలవారికి — హెబ్రీ 4:1.
B. క్రీస్తునొద్దకు వచ్చి ఆయన గూర్చి నేర్చుకొనేవారికి
 — మత్తయి 11:29; యోహా 6:44.
C. విశ్వాసముతో ఆయన కాడిని మోసేవారికి
 — మత్తయి 11:28-29; హెబ్రీ 4:3, 11.
D. శ్రమలు భరిస్తూ దేవుని నిజమైన ప్రజలుగా ఉన్నవారికి 
— 2 థెస్స 1:7; హెబ్రీ 4:9.
E. అంతము వరకు నమ్మకంగా ఉండి ప్రభువునందు మరణించేవారికి — మత్తయి 10:22; ప్రకటన 14:13.

IV. మనం ఎప్పుడు ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తాము?
A. ఈ లోక భూసంబంధమైన పని ముగిసినప్పుడు 
— హెబ్రీ 4:10.
B. మరణము తదుపరి ఆత్మీయ స్థితిలో 
— హెబ్రీ 9:27; ప్రకటన 14:13.
C. అంతిమ న్యాయతీర్పు సమయమందు 
— మత్తయి 25:31-41.

V. ముగింపు
A. పరలోకం క్రైస్తవునికి నిత్య విశ్రాంతి.
B. కాబట్టి అంతము వరకు విశ్వాసంగా ఉందాం.

కామెంట్‌లు