దేవుని ప్రజల ప్రయాణాలు
దేవుని ప్రజల ప్రయాణాలు
పాఠ్యభాగము: హెబ్రీ 3:7-19
ముఖ్య భావము: ఐగుప్తు నుండి వాగ్దాన దేశము వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణం, పాప బానిసత్వం నుండి పరలోక రాజ్యము వరకు క్రైస్తవుని ఆత్మీయ ప్రయాణమునకు ఒక గొప్ప మాదిరి.
I. ఐగుప్తు బానిసత్వం నుండి విమోచనం
- A) దేవుడు మోషే ద్వారా తన ప్రజలను విడిపించాడు
నిర్గ 3:10; నిర్గ 6:6-8 - B) ఎర్ర సముద్రమును దాటించి రక్షించాడు
నిర్గ 14:15-16; 1 కొరి 10:1-2 - C) విమోచన పొందిన తరువాత కూడా ప్రజలు ఫిర్యాదు చేశారు
నిర్గ 14:11-12; నిర్గ 16:2-3
II. అరణ్య ప్రయాణములో నేర్చుకోవలసిన పాఠాలు
- A) అవిశ్వాసము మరియు తిరుగుబాటు అనేకులను నాశనము చేసింది
సంఖ్యా 16:1-35; కీర్త 106:24-26 - B) యెహోషువ, కాలేబు మాత్రమే విశ్వాసముతో నిలిచారు
సంఖ్యా 14:6-10 - C) ఐగుప్తును తలచి వెనుకకు వెళ్లాలని కోరుకొన్నారు
సంఖ్యా 11:5; సంఖ్యా 14:4 - D) దేవుడు పరలోకమునుండి మన్నాను ఇచ్చి పోషించాడు
నిర్గ 16:4; యోహా 6:32-35 - E) సణుగుటకు బదులు విశ్వాసముతో దేవునిపై ఆధారపడాలి
నిర్గ 17:2; నిర్గ 16:2,8; కీర్త 106:11-12
III. క్రైస్తవుని ఆత్మీయ ప్రయాణము
- A) బాప్తిస్మము ద్వారా క్రీస్తునందు ప్రవేశిస్తాము
1 కొరి 10:1-2; మార్కు 16:16; అపొ 2:38; అపొ 8:36-38; అపొ 10:47-48; అపొ 16:30-33; అపొ 18:8; అపొ 19:5 - B) విశ్వాస పరీక్షలో స్థిరముగా నిలవాలి
2 కొరి 5:7; హెబ్రీ 10:39 - C) సంఘములో నమ్మకముగా నిలిచి లోకాసక్తిని విడిచిపెట్టాలి
హెబ్రీ 3:8-19; అపొ 20:28-30; ప్రక 3:4; 1 యోహా 2:15-17 - D) ఆరాధన, త్యాగము, సేవలలో ఫిర్యాదు చేయకూడదు
హెబ్రీ 10:25; 1 కొరి 16:12; రోమా 12:1-2
IV. పరలోక వాగ్దాన దేశమును చేరాలి
- A) అవిశ్వాసులు దేవుని విశ్రాంతిలో ప్రవేశింపరు
హెబ్రీ 3:16-19; ఎఫె 5:3-5 - B) మరణము వరకు నమ్మకముగా నిలిచినవారికి జీవకిరీటము
ప్రక 2:10; ప్రక 14:13 - C) పాప బానిసత్వము విడిచి ఇరుకు మార్గములో నడవాలి
రోమా 3:23; మత్త 7:13-14
ముగింపు: ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణము మనకు హెచ్చరిక. అవిశ్వాసము, సణుగుట, తిరుగుబాటును విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వాసముతో నిలిచి పరలోక వాగ్దాన దేశమును చేరుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు అరణ్యములో ఇశ్రాయేలీయులవలె సణుగుచున్నావా, లేక యెహోషువ, కాలేబులవలె విశ్వాసముతో పరలోక లక్ష్యము వైపు నడుస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి