యేసు - మహా వైద్యుడు

                యేసు – మహా వైద్యుడు

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — మార్కు 2:17; లూకా 4:23

నిశ్చయం: రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు; నేను నీతిమంతులను పిలువ రాలేదు గాని పాపులను పిలువ వచ్చితినని వారితో చెప్పెను.

I. మానవుని పాపభరితమైన ఆత్మీయ హృదయ స్థితి

  • 1) దేవుని దృష్టికి సరైనది కాక కఠినముగా మారిన హృదయము అపొ.కా 8:21; రోమా 3:23; మార్కు 8:17; అపొ.కా 7:54
  • 2) దుష్టత్వముతోను మరియు వ్యభిచార పాపములతోను నిండిన హృదయము మత్త 5:28; మత్త 15:19; మత్త 12:34-35; మత్త 7:21-23; హెబ్రీ 3:12
  • 3) దేవునికి దూరమై తప్పులతోను మూర్ఖత్వముతోను నిండిన హృదయము మత్త 15:8-9; మార్కు 7:6-9; కీర్త 14:1

II. మహా వైద్యుని యొద్ద హృదయానికి లభించే దైవిక చికిత్స

  • 1) వాక్యము కొరకు తెరవబడి పాపభారముతో పశ్చాత్తాపపడే నిజాయితీగల హృదయము లూకా 8:15; అపొ.కా 2:37; అపొ.కా 16:14
  • 2) క్రీస్తు ద్వారా మార్చబడే శుద్ధమైన మరియు నూతనమైన హృదయము మత్త 5:8; యెహె 36:26
  • 3) స్వంత జ్ఞానముపై ఆధారపడక దేవుని వాక్యమునకు లోబడే విధేయతగల హృదయము రోమా 6:17-18; ఎఫె 6:6; మత్త 7:21; సామె 3:5

III. యేసు రక్తము ద్వారా కలిగే పాప నివారణ మరియు ఆత్మీయ పునరుద్ధరణ

  • 1) విమోచన, నీతి మరియు పవిత్రతను ఇచ్చే క్రీస్తు అమూల్యమైన రక్తము మార్కు 14:24; ప్రక 1:5; కీర్త 79:9; ఎఫె 1:7; 1పేతు 1:18-19; కొల 1:20; రోమా 5:9; హెబ్రీ 13:12; 1యోహా 1:7
  • 2) క్రీస్తు గాయముల ద్వారా పొందుకునే ఆత్మీయ స్వస్థత మరియు పాప క్షమాపణ రక్షణ 1పేతు 2:24; యోహా 19:34; రోమా 6:3-5; 1పేతు 1:22
  • 3) క్రీస్తు నందు నూతన సృష్టిగా మారి వాక్యమనే ఆహారముతో ఆత్మీయ అభివృద్ధి చెందుట 2కొరి 5:17; మత్త 28:18-20; 1పేతు 2:2; 1తిమో 4:7-8; హెబ్రీ 5:14; హెబ్రీ 12:11; 2పేతు 1:5-7; 2పేతు 3:18

ముగింపు: మన పాపవ్యాధిని నివారించగల ఏకైక మహా వైద్యుడు యేసుక్రీస్తు మాత్రమే గనుక, ఆయన రక్తము ద్వారా కడగబడి, నూతన సృష్టిగా మారి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు