సత్యాన్ని అడ్డగించడం

                సత్యాన్ని అడ్డగించడం.  

పరిచయం: మన ఆత్మీయ విశ్వాస పరుగులో సత్యానికి విధేయులం కాకుండా అడ్డుపడే ప్రతి లోపాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి.

పాఠ్యభాగము: "సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?" — గలతీ 5:7

I. సిద్ధాంతపరమైన లోపం

  • ఎ) తప్పుడు సిద్ధాంతాలు మరియు నాశనకరమైన బోధలు (గలతీ 5:7-12; గలతీ 2:4-5; 2 పేతు 2:1)
  • బి) సత్యమును విడిచి కల్పిత కథల వైపు తిరుగుట (2 తిమో 4:3-4)

II. నిరంతరం అనవసరమైన వివాదం

  • ఎ) ఒకరినొకరు కరచుకొనక సత్య విశ్వాసముకై పోరాడుట (గలతీ 5:15; గలతీ 2:11-14; యూదా 3)
  • B) కలహములు రేపే వ్యర్థ వివాదములను విడిచిపెట్టుట (1 తిమో 6:3-5; 2 తిమో 2:23-24; తీతు 3:9; 1 కొరి 3:1-4)

III. శరీర సంబంధమైన మనస్తత్వం

  • ఎ) ఐహిక విచారములను విడిచి ఆత్మానుసారముగా నడుచుకొనుట (గలతీ 5:16-26; లూకా 8:14)
  • B) దేవుని రాజ్యానికి అడ్డముగా నిలిచే శరీర క్రియలను జయించుట (గలతీ 5:17-24)

ముగింపు: విశ్వాస పరుగులో సత్యాన్ని అడ్డగించే అబద్ధ బోధలను, వ్యర్థ వివాదాలను మరియు శరీర ఆశలను విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో నమ్మకంగా సాగిపోదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: మీ ఆత్మీయ పరుగులో సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఏదైనా అడ్డగిస్తోందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు