ఎంపిక చేసుకొనుట/ కోరుకొనుట
ఎంపిక చేసుకొనుట / కోరుకొనుట
మూలవాక్యము: ఆదికాండము 13:10-12 — లోతు తన కన్నులకు ఇంపైన దేశమును ఎంచుకొని, తరువాత దాని చేదు ఫలితాలను అనుభవించెను.
ముఖ్యాంశం: మన ఎంపికలు మన ఆత్మీయ, కుటుంబ, నిత్యజీవిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రతి నిర్ణయం దేవుని చిత్తానుసారంగా ఉండాలి.
I. లోతు చేసిన తప్పు ఎంపిక
- A. కన్నులకు ఇంపైనదానిని ఎంచుకొని సొదొమ వైపు వెళ్లెను — ఆదికాండము 12:5; 13:6-12
- B. దుష్టుల మధ్య నివసించి ఆస్తి, కుటుంబము, గౌరవము కోల్పోయెను — ఆదికాండము 14:11-12; 19:15-17,30-36; 2 పేతురు 2:7-8
II. మన ఎంపికలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి
- A. మంచి సహవాసము ఆశీర్వాదము, చెడు సహవాసము నాశనము — సామెతలు 17:17; 12:26; 1 కొరింథీయులకు 15:33
- B. ఆత్మీయ క్షేమం లేని లౌకిక లాభము చివరికి నష్టమే — ఆదికాండము 13:10-12
III. సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి?
- A. దేవుని జ్ఞానమును ప్రార్థనతో అడిగి ఆయన చిత్తాన్ని వెదకాలి — యాకోబు 1:5-8; కీర్తనలు 37:5-6,23-26
- B. జ్ఞానుల ఆలోచన వినుచు ప్రతి కార్యమును ప్రభువునందే చేయాలి — సామెతలు 11:14; 12:15; కొలొస్సీయులకు 3:17
IV. తప్పు నిర్ణయం చేసినప్పుడు ఏమి చేయాలి?
- A. పాపమును వెంటనే విడిచి దేవుని వైపు తిరగాలి — ఆదికాండము 19:15-17
- B. నిజమైన పశ్చాత్తాపముతో మార్పు పొందాలి — మత్తయి 26:75; అపొస్తలుల కార్యములు 9:1-6
ముగింపు
- I. లోతు లౌకిక లాభాన్ని చూసి ఆత్మీయ నష్టాన్ని పొందెను.
- II. ప్రతి నిర్ణయం దేవుని చిత్తానుసారంగా ఉండాలి.
- III. మంచి సహవాసము, దేవుని జ్ఞానము మనలను సరైన మార్గంలో నడిపిస్తాయి.
- IV. తప్పు నిర్ణయం చేసినవారు వెంటనే పశ్చాత్తాపపడి ప్రభువునొద్దకు తిరిగి రావాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీ జీవిత నిర్ణయాలలో లౌకిక లాభాన్నే చూస్తున్నావా? లేక దేవుని చిత్తాన్ని వెదికి ఆత్మీయ క్షేమాన్ని ఎంచుకుంటున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి