అహాబు యెజెబెలు మరియు నాబోతు * చరిత్ర

అహాబు, యెజెబెలు మరియు నాబోతు

మూలవాక్యము: 1 రాజు 21:20

పరిచయం: దేవునికి విరోధముగా జీవించి, నిర్దోషులను హింసించువారు చివరికి దేవుని నీతియుక్తమైన తీర్పును తప్పించుకోలేరు.

I. అహాబు, యెజెబెలు కాలంలోని దుష్టపాలన

A. అహాబు దేవునికి విరోధముగా నడిచెను: దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి బయలు దేవతను పూజిస్తూ దుష్టత్వాన్ని జరిగించెను.

1 రాజు 16:29-33; ద్వితీ 17:1; 18:4,13,39-40

B. ఏలీయా ద్వారా దేవుడు హెచ్చరించెను: ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరికలు పంపినా వారు మారుమనస్సు పొందలేదు.

1 రాజు 19:1-2; 20:20,22,26,34,42-43

II. అహాబు, యెజెబెలు దుష్టత్వము

A. దేవుని ఆజ్ఞలను తృణీకరించిరి: దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర విధులను నిర్లక్ష్యం చేసి తమ స్వంత ఇష్టప్రకారం ప్రవర్తించారు.

1 రాజు 16:30,33; 1 సమూ 8:10; లేవీ 25:14,23

B. లోభముతో అన్యాయము చేసిరి: ఇతరుల ఆస్తిపై ఆశపడి దురాశతో అక్రమానికి ఒడిగట్టారు.

సంఖ్యా 36:7; 1 తిమో 6:6-10; ప్రక 2:20

III. నాబోతుపై అన్యాయము

A. అబద్ధ సాక్ష్యములతో హత్య చేయించిరి: నాబోతు ద్రాక్షతోటను దక్కించుకోవడానికి కుట్ర పన్ని అబద్ధ నిందలతో అతనిని రాళ్లతో కొట్టి చంపించారు.

1 రాజు 21:8-13; మత్త 26:65; అపొ 6:13; 25:7-8

B. నీతిమంతులు శ్రమలను అనుభవించుదురు: దేవుని వాక్యానికి కట్టుబడిన నీతిమంతులు ఈ లోకంలో శ్రమలు పొందుతారు.

హెబ్రీ 11:37

IV. అహాబు పాక్షిక పశ్చాత్తాపము

A. వినయము కనపరచెను: దేవుని తీర్పు మాటలు విని తాత్కాలికంగా తగ్గింపును, వినయాన్ని కనపరిచాడు.

1 రాజు 21:27-29

B. తీర్పు ఆలస్యమైనా రద్దుకాలేదు: దేవుని కనికరం వల్ల శిక్ష వాయిదా పడిందే తప్ప పూర్తిగా రద్దు కాలేదు.

1 రాజు 22:1

V. దేవుని నీతియుక్తమైన తీర్పు

A. అహాబుపై తీర్పు నెరవేరెను: దేవుడు ప్రవచించిన ప్రకారమే యుద్ధంలో అహాబు మరణించి దేవుని తీర్పు నెరవేరింది.

1 రాజు 21:17,19,21,23,25; 22:37-38

B. యెజెబెలు మరియు ఆమె వంశముపై తీర్పు వచ్చెను: యెజెబెలు ఘోరమైన చావును పొందింది, వారి దుష్ట వంశమంతా నిర్మూలించబడింది.

2 రాజు 9:7-10,24-26,30-37; 10:1,11; 1 రాజు 15:29; 16:3,11

VI. మనకు పాఠములు

A. దేవుని తీర్పు తప్పదు: మనుష్యులు చేసే ప్రతీ క్రియకు దేవుని న్యాయమైన తీర్పు తప్పక వస్తుంది.

ప్రసం 9:11-12

B. లోభము, అన్యాయము వినాశనమునకు దారితీయును: పాపము మరియు లోభత్వము మనిషిని ఆధ్యాత్మిక, నిత్య వినాశనానికి నడిపిస్తాయి.

1 రాజు 21:20; గల 6:7

ముగింపు: అహాబు, యెజెబెలు, నాబోతు చరిత్ర దేవుని న్యాయం ఆలస్యమైనా తప్పదని, లోభము మరియు అన్యాయము వినాశనానికి దారితీస్తాయని మనకు బోధిస్తుంది.

🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుని నీతిని గౌరవిస్తూ, లోభమును విడిచిపెట్టి, సత్యములో నడుచుచున్నారా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు