ఖరీదైన తప్పిదం

                        ఖరీదైన తప్పిదం
       మూలవాక్యము: (సంఖ్యాకాండము 20)

I. మోషే చేసిన తప్పిదపు స్వభావం
A. దేవుని ఆదేశాన్ని మార్చి రాయితో మాట్లాడక కొట్టాడు 
— సంఖ్యా 20:8,10.
B. దేవుడు తన వాక్యములో ఎలాంటి మార్పులను సహించడు
 — హెబ్రీ 8:5; 2 యోహాను 9; లేవీయ 10:1-2; 2 సమూ 6:3-7.
C. దేవుని వాక్యానికి ఎల్లప్పుడూ లోబడి కట్టుబడి ఉండాలి — ప్రక 22:18-19; 1 పేతురు 4:11; యూదా 3.
D. మేము నీళ్ళిచ్చెదమా అని దేవుని మహిమను అగౌరపరిచాడు — సంఖ్యా 20:10,12.
E. దేవుని ఆజ్ఞను కాదని నేటికీ సంఘాన్ని పక్కనపెడుతున్నారు 
— కొలస్సయి 1:18; అపొ 4:12; ఎఫెసీ 3:10,21; 4:12.
F. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞపై తిరగబడ్డాడు 
— సంఖ్యా 20:12,24; ద్వితీ 3:26-27; మత్తయి 15:1-9.
G. కోపంలో అనాలోచితంగా మాట్లాడి బండను రెండుసార్లు కొట్టాడు — కీర్తన 106:32-33; మత్తయి 5:22.
H. ఇశ్రాయేలు ప్రజల ముందే బహిరంగంగా పాపం చేశాడు — సంఖ్యా 20:12; రోమా 14:7-8; మత్తయి 5:13-16.
I. మన ప్రతి రహస్య, బహిరంగ పాపాలను ఒప్పుకోవాలి 
— రోమా 2:16; యాకోబు 5:16.

II. ఈ తప్పిదం యొక్క తీవ్రత
A. మోషే ఎన్నో గొప్ప కార్యాలు చేసి మధ్యవర్తిగా నిలిచాడు — హెబ్రీ 11:24-28.
B. అంతటి వాడైనా కనాను దేశం చేరలేదు, ఇది మనకు బోధ — రోమా 15:4; హెబ్రీ 3:16-19.
C. నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోకం చేరలేరు, జాగ్రత్తపడాలి 
— 1 కొరిం 10:10-12; మత్తయి 7:21-23.

III. ఆ తప్పిదపు ఫలితాలు
A. మోషే లోక కనాను కోల్పోయినా, పరలోకం వెళ్లాడు 
— ద్వితీ 34:4-5; మత్తయి 17:1-5.
B. లోక కనాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది, మోషేకు ఇది తీవ్ర నిరాశ.
C. తీర్పు దినమున మన ఆత్మీయ పరిస్థితి ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి.

కామెంట్‌లు