జీవితం లో విజయం సాధించుటకు (
జీవితంలో విజయం సాధించుటకు (పాఠం 3)
మూలవాక్యం: సామెతలు 3:13 - జ్ఞానము సంపాదించుకొనినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
I. దేవుని పట్ల జ్ఞానంతో ప్రవర్తించుట
- A. దేవుని వాక్యమును గమనించుట సామె 3:1-4
- B. వాక్యానుసారమైన దీర్ఘాయువు, శాంతి మరియు దైవకృప సామె 4:10; ఎఫె 6:1-3; సామె 3:4
- C. స్వంత తెలివిని విడిచి యెహోవాపై నమ్మకముంచుట సామె 3:5-6; సామె 14:12; సామె 16:25
- D. స్వబుద్ధిని నమ్మక దేవునికి భయపడి దుష్టత్వమును విడుచుట సామె 3:7-8; సామె 26:12; యెష 5:21; సామె 1:7; సామె 9:10
- E. మనకున్న ఆస్తులతో, సంతోషమైన దాతృత్వముతో దేవుని ఘనపరచుట సామె 3:9-10; 1కొరి 16:1-2; 2కొరి 9:6-7; ద్వితీ 28:8; మత్త 6:33
- F. ప్రేమతో కూడిన దేవుని శిక్షను అంగీకరించుట సామె 3:11-12; హెబ్రీ 12:6, 10-11
- G. వెండిబంగారముల కన్నా శ్రేష్ఠమైన దైవిక జ్ఞానాన్ని పొందుట సామె 3:13-18
II. మనుషుల పట్ల జ్ఞానంతో ప్రవర్తించుట
- A. అప్పులను మరియు ఇవ్వవలసిన వాటిని వెంటనే తీర్చుట సామె 3:27; రోమా 13:7-8
- B. పొరుగువారికి హాని తలపెట్టకుండుట సామె 3:29-30
- C. నిందలు, ఆర్థిక మోసములు మరియు కోర్టు వివాదములకు దూరముగా ఉండుట సామె 20:10, 14, 19; సామె 25:8; సామె 26:20; 1కొరి 6:1-8
- D. దుష్టులను చూసి అసూయపడక వినయముతో కృప పొందుట సామె 3:31-32, 34; యాకో 4:6; 1పేతు 5:5
III. స్వయం పట్ల జ్ఞానంతో ప్రవర్తించుట
- A. జీవధారల నిలయమైన హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుట సామె 4:23
- B. అంతరంగాన్ని నిరంతరము పవిత్రముగా ఉంచుకొనుట 1తిమో 5:22
- C. ఆత్మీయ, శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసే లైంగిక పాపములను విసర్జించుట సామె 5:1-5
- D. పతనాగారమైన మత్తు పానీయములకు పూర్తిగా దూరముండుట సామె 23:29-32
IV. ముగింపు
- A. దేవుని పట్ల, ఇతరుల పట్ల మరియు స్వయం పట్ల దైవిక జ్ఞానము కలిగి నడుచుకునేవారే విజేతలు సామె 3:2, 4, 14-26
ఆత్మీయ ప్రశ్న: లోకసంబంధమైన తాత్కాలిక విజయాల కొరకు ప్రాకులాడుతున్నావా? లేక దీర్ఘాయువును, నిత్య శాంతిని ఇచ్చే దైవిక జ్ఞానాన్ని కలిగి జీవిస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి