మన సహోదరుని విషయంలో మనం నిజంగా అపరాధులం
మన సహోదరుని విషయంలో మనం నిజంగా అపరాధులం
మూలవాక్యము: ఆది 42:21
పరిచయం: సహోదరునిపట్ల ప్రేమ, క్షమ, బాధ్యతతో జీవించుట క్రైస్తవుని ఆత్మీయ లక్షణము.
I. ప్రవర్తన మరియు మాటల ద్వారా అపరాధులం కాకూడదు
- A. మాటలతో, ప్రవర్తనతో హృదయాలను గాయపరచకూడదు
సామె 15:1; ఎఫె 4:32 - B. అపవాదు, చెడు మాటలతో కీర్తిని పాడుచేయకూడదు
సామె 11:13; యాకో 4:11 - C. ఆపదలో సహోదరుని విడిచిపెట్టకూడదు
మత్త 26:56; లూకా 10:33-36; 2 తిమో 4:10,16
II. ఆత్మీయ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు
- A. సహోదరుల కొరకు ప్రార్థించాలి
యాకో 5:16; హెబ్రీ 13:18; 3 యోహా 2 - B. మంచి మాదిరిగా జీవించి, పగను విడిచిపెట్టాలి
హెబ్రీ 12:12-13; మత్త 6:14-15; ఎఫె 4:31-32
III. ఆత్మీయ సహాయము చేయాలి
- A. తప్పిపోయిన సహోదరుని ప్రేమతో పునరుద్ధరించాలి
గల 6:1-2; హెబ్రీ 10:24 - B. విమర్శించకుండా ప్రోత్సహించాలి
1 కొరి 1:3-4
IV. యోసేపు సహోదరుల నుండి పాఠము నేర్చుకుందాం
- A. అపరాధాన్ని గుర్తించి పశ్చాత్తాపపడిరి
ఆది 42:21 - B. క్రీస్తు ప్రేమతో సహోదరుల పట్ల నిర్దోషులముగా జీవిద్దాం
యోహా 13:34-35; రోమా 12:18
ముగింపు: యోసేపు సహోదరులవలె ఆలస్యంగా కాదు, ఈ రోజే ప్రేమ, క్షమ, బాధ్యతతో సహోదరుల పట్ల నిర్దోషులముగా జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: మీ సహోదరుని పట్ల ప్రేమతో, క్షమతో, ఆత్మీయ బాధ్యతతో జీవిస్తున్నారా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి