జీవించడానికి అవసరమైన పది పవిత్ర గ్రంథ వాక్యాలు
జీవించడానికి అవసరమైన పది పవిత్ర గ్రంథ వాక్యాలు
📍 ఆధారం: 2 కొరింథీ 4:17-18 – క్షణికశ్రమ నిత్యమైన మహిమను కలుగజేయును.
ఈ 10 వాక్యాలు మన జీవితానికి ఆత్మీయ లాంటివి. దేవుని చిత్తప్రకారం జీవించడానికి ఇవి మార్గదర్శకాలు.
పది ప్రాముఖ్యమైన లేఖలు - ముఖ్యాంశాలు:
(1) ఆదికాండము 1:1 – దేవుడు సృష్టికర్త; ఆయనకు విధేయులు జీవించడమే మన లక్ష్యం.
(2) యెషయా 40:31 – యెహోవా కొరకు కనిపెట్టుకొనేవారు నూతన బలము పొందుదురు.
(3) యెషయా 55:6-7 – దొరుకు కాలమున వెదకాలి; ఆయన బహుగా క్షమించును.
(4) యెషయా 55:8-9 – దేవుని తలంపులు, మార్గములు మనకంటే ఎంతో ఉన్నతమైనవి.
(5) రోమా 8:31-32 – దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవ్వడూ లేడు.
(6) సామెతలు 17:22 – సంతోషము గల మనస్సు శరీరానికి ఆరోగ్య కారణము.
(7) యోహాను 14:15 – దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుట.
(8) ఫిలిప్పీ 2:4 – స్వార్థము వీడి ఇతరుల కార్యములను కూడా లక్ష్యపెట్టాలి.
(9) 2 కొరింథీ 5:10 – మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట లెక్క అప్పగించాలి.
(10) 2 కొరింథీ 4:17-18 – దృశ్యమైన తాత్కాలిక వాటిని కాక, అదృశ్యమైన నిత్యమైన వాటిని చూడాలి.
ముగింపు: మంచి చేసినా, చెడు చేసినా దేవుని యొద్ద ప్రతిఫలము ఉంటుంది. కాబట్టి, ఈ తాత్కాలిక లోకంలో దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ, నిత్యత్వం కొరకు సిద్ధపడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి