యువకుడి పతనం

                          యువకుడి పతనం
 మూలవాక్యము: నా కుమారుడా, నా మాటలను గైకొనుము నా ఆజ్ఞలను నీయొద్ద భద్రము చేసికొనుము — సామె 7:1
🔴 I. యువకుడికి దైవిక హెచ్చరిక
A. దేవుని మాటలను హృదయమందు కాపాడాలి 
— సామె 7:1-4.
B. జ్ఞానవివేకాలను తోబుట్టువుల వలె భావించాలి
 — సామె 7:4.
C. ప్రపంచపు పాపపు మాయ నుండి జాగ్రత్తపడాలి.
🔴 II. పతనానికి గురైన యువకుడి ఆత్మీయ స్థితి
A. దైవిక వివేకము లేని అవివేకిగా ఉండుట 
— సామె 7:7; యోబు 28:28; సామె 2:11-12; 3:13; 16:22; 21:16; 23:23.
B. తప్పుడు స్నేహములు, దుష్టసాంగత్యములో ఉండుట
 — సామె 7:7; సామె 13:20; 1 కొరిం 15:33.
C. ఆత్మీయ అలసత్వముతో పాపపు ప్రదేశాలలో సంచరించుట — సామె 7:8; యెహె 16:49.
D. వెలుగును విడిచి అర్ధరాత్రి చీకటిలో తిరుగుట
 — సామె 7:8-9; యోబు 24:15; యోహా 3:19-21.
🔴 III. ప్రలోభపెట్టే వ్యభిచార లోక లక్షణాలు
A. ఇతరులను ఆకర్షించే అపవిత్ర వస్త్రధారణ కలిగియుండుట — సామె 7:10; 1 తిమో 2:9-10; 1 పేతురు 3:1-4.
B. ఉద్దండమైన ముఖము, కపట హృదయము కలిగియుండుట — సామె 7:10, 13.
C. గృహమందు నిలకడలేక శోధించే మాటలతో తిరుగుట
 — సామె 7:11, 13.
D. భక్తి ముసుగులో మోసపూరిత ధార్మికతను ప్రదర్శించుట — సామె 7:14-15.
E. దేవుని భయము లేకుండా పాపపు కూపానికి ఆహ్వానించుట 
— సామె 7:16-18; ఆది 39:7; 1 కొరిం 6:18.
F. దేవుడు చూడడనే ధైర్యముతో సాకులు వెతుకుట
 — సామె 7:19-20.
🔴 IV. ప్రలోభములో యువకుడి పతనం
A. మాయచేసే లోకపు మధుర భాషకు లొంగిపోవుట 
— సామె 7:21; 5:3-5; 12:2; 29:5.
B. పశువు వలె అవివేకముగా పాపపు శిక్షకు వెళ్ళుట 
— సామె 7:22-23; సామె 22:1; 1 కొరిం 6:9-10; గలతీ 5:19-21; 2 పేతురు 2:14.
🔴 V. ఈ పాఠం ద్వారా నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలు
A. దైవసేవకుని ద్వారా వచ్చే సరైన మార్గదర్శకత్వము వినాలి — సామె 7:24.
B. దేవుని వాక్యపు మంచి సలహాలను జీవితంలో పాటించాలి — సామె 7:25.
C. నరక ద్వారము వంటి పాపపు హెచ్చరికను గమనించాలి — సామె 7:26-27.
🔴 VI. ముగింపు
A. యవ్వనస్థులు తమ స్వంత ఆశలకు, లోకపు మాయా మాటలకు లొంగిపోతే ఆదాము వలె ఆత్మీయంగా పతనమైపోతారు.
B. కాబట్టి, వాక్యమనే కళ్లెమును కలిగి, జ్ఞానాన్ని ఆశ్రయించి పాపపు శోధనల నుండి మనలను మనం కాపాడుకుందాం.

కామెంట్‌లు