జంతువుల నుండి నేర్చుకోవలసిన పాఠాలు

 జంతువుల నుండి నేర్చుకోవలసిన పాఠాలు

మూలవాక్యము: సంఖ్యా. 22:28 — యెహోవా గాడిద నోరు తెరచెను.

ప్రవేశిక: దేవుడు జంతువుల ద్వారా కూడా మనకు ఆత్మీయ పాఠాలు బోధిస్తున్నాడు.

I. బిలాము గాడిద నుండి నేర్చుకోవాలి

  • A. దేవుడు ఎవరి ద్వారా అయినా హెచ్చరించగలడు
    సంఖ్యా. 22:1-38; 2 పేతు. 2:14-16
  • B. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయకూడదు
    యూదా. 11; ప్రక. 2:12-14
  • C. అవిధేయత చివరికి నాశనమునకు దారితీస్తుంది
    యెహో. 13:22

II. భారమోసే జంతువుల నుండి నేర్చుకోవాలి

  • A. కఠినహృదయముగా ఉండకూడదు
    నిర్గ. 32:9; 34:9; ద్వితీ. 9:6
  • B. దేవునికి లోబడే హృదయము కలిగి ఉండాలి
    ద్వితీ. 10:16; అపొ. 7:51
  • C. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు
    అపొ. 7:51

III. మునికోలును తన్నకూడదు

  • A. దేవుని పిలుపును ఎదిరించుట ప్రమాదకరము
    అపొ. 9:1-5; 26:12-14
  • B. జ్ఞానబోధను అంగీకరించాలి
    ప్రసం. 12:11; 1 తిమో. 4:6-11
  • C. వంచించే బోధలను తిరస్కరించాలి
    1 తిమో. 4:1-2

IV. గొర్రెలు మరియు కాపరి నుండి నేర్చుకోవాలి

  • A. మంచి కాపరియైన క్రీస్తును అనుసరించాలి
    కీర్త. 23:1-4; యెహె. 34:11-12
  • B. తప్పిపోయిన వారిని వెదకాలి
    మత్త. 18:11-14
  • C. నీతిమంతులుగా నిలిచి రక్షణ పొందాలి
    మత్త. 25:31-33

ముగింపు: జంతువుల ద్వారా దేవుడు నేర్పిన పాఠాలను పాటించి విధేయులముగా జీవిద్దాం.

ఆత్మీయ ప్రశ్న: దేవుడు నేర్పే పాఠాలను నేను వినుచున్నానా?

కామెంట్‌లు