ఏలియా ది తిష్బీయుడు"

                 ఏలియా ది తిష్బీయుడు

పాఠ్యభాగము: 1 రాజు 17–21; 2 రాజు 1–2

ముఖ్య భావము: దేవుని వాక్యమునకు విధేయుడైన విశ్వాసి ద్వారా దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరచి, సత్యమును స్థిరపరచును.

I. అహాబు దుష్ట రాజుగా జీవించాడు

  • A) యెహోవా దృష్టికి అత్యంత చెడు చేసెను
    1 రాజు 16:30; 21:25
  • B) బయలు ఆరాధనను ప్రోత్సహించి దేవుని ప్రవక్తలను హింసించాడు
    1 రాజు 16:32; 18:4

II. ఏలియా దేవునికి విశ్వాసమైన సేవకుడు

  • A) గిలాదీయుడైన తిష్బీయుడు, విశ్వాసముగల మనిషి
    1 రాజు 17:1; యాకో 5:17-18
  • B) దేవుని మాట ప్రకారము ధైర్యముగా నిలిచాడు
    2 రాజు 1:7-8; 1 రాజు 17:2-6

III. దేవుడు తన సేవకుని అద్భుతముగా పోషించాడు

  • A) కెరీతు వాగు, జారెఫతు విధవరాలి ద్వారా పోషించాడు
    1 రాజు 17:7-16
  • B) విధవరాలి కుమారునికి ప్రాణము ఇచ్చాడు
    1 రాజు 17:22-23

IV. కర్మేలు పర్వతముపై దేవుని మహిమ ప్రత్యక్షమైంది

  • A) అగ్ని దించి యెహోవాయే దేవుడని నిరూపించాడు
    1 రాజు 18:37-39
  • B) ప్రార్థనచేత వర్షము కురిపించాడు
    1 రాజు 18:41-45

V. ఏలియా జీవితము మనకు నేర్పే పాఠాలు

  • A) దేవుడు పాపమును ద్వేషించి విధేయులను ఆశీర్వదించును
    కీర్త 5:4; రోమా 6:23; 1 రాజు 17:15-16
  • B) విశ్వాసపూర్వక ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును
    నిర్గ 23:2; యాకో 5:15-18

ముగింపు: ఏలియావలె దేవుని వాక్యమునందు స్థిరముగా నిలిచి, విశ్వాసముతో ప్రార్థిస్తూ జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు ఏలియావలె దేవుని మాటను ధైర్యముగా ప్రకటించి, విశ్వాసముతో జీవిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు