మరణమును తలంచి చూడు

మరణమును తలంచి చూడు

ముఖ్యాంశం: శారీరక మరణము తప్పించుకొనుట అసాధ్యము, కానీ జీవమార్గము ద్వారా పాతాళ యాతన తప్పించుకొనుట సాధ్యము.

I. మరణము తప్పించుకొనుట అసాధ్యము

A. నరులందరికీ ఒక్కసారే మరణము విధింపబడినది

ఆది 3:19; హెబ్రీ 9:27

B. ఆయుష్షు ఎంత సుదీర్ఘమైనా నరుడు పరిమితుడే

ఆది 5:27; ద్వితీ 34:7; ఆది 6:3; కీర్త 90:10; లూకా 12:16-21

II. గొప్పవారిని కూడ మరణము ఆపలేదు

A. భక్తిపరులైనను, రాజులైనను చావును తప్పించుకొనలేరు

ఆది 15:15; 1రాజు 2:1-2; కీర్త 89:48

III. పాతాళవశము కాకుండా తప్పించుకొనుట సాధ్యము

A. క్రీస్తు చూపిన జీవమార్గము ద్వారా ఆత్మను రక్షించుకొనవచ్చును

కీర్త 89:48; లూకా 16:19-31; సామె 15:24; హెబ్రీ 11:13; యెషా 35:8-9

IV. ముగింపు

A. దేవుని ఏర్పాటు ప్రకారం మనుషులందరికీ శారీరక మరణము, ఆ తర్వాత తీర్పు ఖాయం.

B. లోకసంబంధమైన సంపద, భౌతిక బలము ఏది కూడా మన శరీర మరణాన్ని ఆపలేదు.

C. భక్తిపరులైన అబ్రహాము, దావీదు వంటి గొప్పవారే మరణము గుండా వెళ్లవలసి వచ్చింది.

D. శరీర మరణాన్ని ఆపడం అసాధ్యమైనా, జీవమార్గంలో నడవడం ద్వారా పాతాళ యాతన తప్పించుకోవడం సాధ్యమే.

E. కాబట్టి, భూసంబంధమైన ఆశలు పక్కనబెట్టి, అనుదినం పరిశుద్ధ మార్గంలో నడుస్తూ ఆత్మరక్షణ కోసం సిద్ధపడాలి.

🎯 ఆత్మీయ ప్రశ్న: శారీరక మరణము తప్పనిసరి అని గ్రహించి, పాతాళ యాతన నుండి తప్పించుకునే జీవమార్గంలో నడుస్తున్నావా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు