సంఘము ఎవరిచేత కట్టబడును? VI

సంఘము ఎవరిచేత కట్టబడును? 

📍 ఆధారం: జెక. 6:12-13 — “చిగురు అను మనుష్యుడు యెహోవా మందిరమును కట్టును.”

 I. “చిగురు” ఎవరు?

  • A. ప్రవచనాలలో చెప్పబడిన చిగురు
     యెష. 6:12-13 — పరిశుద్ధ చిగురు ప్రవచనము.
     యెష. 11:1 — యెష్షయి మొద్దు నుండి చిగురు.
     యెష. 11:10 — జనులకు నిరీక్షణైన వేరు.
     యిర్మీ. 23:5 — నీతిగల రాజైన చిగురు.
     జెక. 3:8 — సేవకుడైన చిగురు.
  • B. చిగురు యేసుక్రీస్తే
     రోమా. 15:12 — దావీదు వేరైన క్రీస్తు.
     ప్రక. 22:16 — దావీదు వేరు, ఉదయ నక్షత్రము.

 II. సంఘమును కట్టువాడు యేసు క్రీస్తే

  • A. క్రీస్తే సంఘ పునాది
  •  1 కొరి. 3:11 — వేరొక పునాది లేదు.
     మత్త. 16:18 — నా సంఘమును కట్టుదును.
     అపొ. 20:28 — తన రక్తముతో సంపాదించెను.
  • B. సంఘము క్రీస్తుకు చెందింది
     ప్రక. 5:9 — రక్తముచేత ప్రజలను కొనెను.
     రోమా. 16:16 — క్రీస్తు సంఘముల వందనములు.

 III. దేవుడు చూపిన నమూనానే అనుసరించాలి

  • A. దేవుని మాదిరి ప్రకారమే నిర్మాణము
     నిర్గ. 31:1-5 — దేవుడు పనివారిని నియమించెను.
     హెబ్రి. 8:5 — మాదిరి ప్రకారమే చేయుము.
     సంఖ్యా. 8:4 — చూపిన రూపమును అనుసరించెను.
     నిర్గ. 27:8 — పోలిక ప్రకారమే నిర్మించెను.
     నిర్గ. 25:40 — నమూనాను జాగ్రత్తగా అనుసరించుము.

 IV. సంఘ నిర్మాణంలో మానవ ఆలోచనలకు స్థానం లేదు

  • A. దేవుని వాక్యమే ప్రమాణము
    మానవ జ్ఞానం, మేధస్సు, సంప్రదాయాలు ప్రమాణము కావు.
    దేవుడు ఇచ్చిన వాక్య నమూనా ప్రకారమే సంఘము నడవాలి.
    క్రీస్తే సంఘ స్థాపకుడు, పునాది, శిరస్సు.

 ముగింపు

చిగురు అను ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరింది. ఆయన మాత్రమే సంఘాన్ని కట్టువాడు. కాబట్టి సంఘము మానవ అభిప్రాయాలపై కాదు, దేవుడు ఇచ్చిన వాక్య నమూనాపైనే నిర్మించబడాలి.


A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు