పరుగును ముగించడం

పరుగును ముగించడం

ఆధార వాక్యము: 1 కొరింథీ 9:24-27

పరిచయం

A. బహుమతికై పరుగెత్తుడి - అక్షయ కిరీటము కొరకు స్పష్టమైన లక్ష్యముతో మన పరుగును ముగించాలి.

I. చట్టబద్ధంగా పరుగులో ప్రవేశించాలి

A. బాప్తిస్మము ద్వారా క్రీస్తునందు ప్రవేశించి ఆత్మీయ పరుగును ప్రారంభించాలి.

1 కొరి 9:24; గల 3:27

B. మన పరుగు వ్యర్థము కాకుండా స్థిరమైన ఉద్దేశ్యముతో ము ముందుకు పరుగెత్తాలి.

గల 2:2; ఫిలి 3:14

C. విశ్వాసమునకు కర్తయైన క్రీస్తు వైపే మన దృష్టిని నిలిపి పరుగెత్తాలి.

హెబ్రీ 12:1-2

II. ముగింపు వరకు ఓర్పుతో పరుగెత్తాలి

A. శ్రమలు వచ్చినను మరణము వరకు విశ్వాసములో స్థిరంగా కొనసాగాలి.

ప్రక 2:10

B. ఆత్మీయ ప్రయాణానికి ఆటంకమైన ప్రతి భారమును విడిచి ఓర్పుతో పరుగెత్తాలి.

హెబ్రీ 12:1

C. అనుదిన జీవితములో ఆత్మీయ క్రమశిక్షణ మరియు ఆశానిగ్రహము కలిగి జీవించాలి.

1 కొరి 9:25; 2 పేతు 1:5-6

III. అక్షయ కిరీటము కొరకు లక్ష్యముతో పరుగును ముగించాలి

A. నిందలు రాకుండా ఇంద్రియనిగ్రహము కలిగి మన శరీరమును లోబరచుకోవాలి.

1 కొరి 9:26-27

B. క్షయమయ్యే లోక ఆశలపై కాక పరలోక అక్షయ కిరీటముపై దృష్టి నిలపాలి.

1 కొరి 9:25

C. దేవుడు ఇచ్చే నీతి కిరీటము మరియు జీవ కిరీటము కొరకు నిరీక్షణతో ఎదురుచూడాలి.

2 తిమో 4:7-8; యాకో 1:12

IV. ముగింపు

A. క్రమశిక్షణతో, ఓర్పుతో పరుగెత్తి పరలోక బహుమానమును స్వతంత్రించుకుందాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నేను చట్టబద్ధంగా రేసులో ప్రవేశించి, ఓర్పుతో, ఆత్మనిగ్రహంతో, అక్షయ కిరీటము కొరకు నా పరుగును ముగించడానికి సిద్ధంగా ఉన్నానా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711

కామెంట్‌లు