ఇశ్రాయేలు వైఫల్యాల నుండి నేర్చుకోవడం
శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును
ఆధార వాక్యము: 1 కొరింథీ 10:13
పరిచయం
A. దేవుడు నమ్మదగినవాడు, మనకు వచ్చే ప్రతి శోధనలో తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు.
I. ఇశ్రాయేలు ఆశీర్వాదాలను గుర్తుచేసుకోవడం
A. ఇశ్రాయేలీయులు మేఘసన్నిధిలో నడవబడి సముద్రములో బాప్తిస్మము పొందిరి.
1 కొరి 10:1-2
B. వారు ఆత్మసంబంధమైన ఆహారమును భుజించిరి, ఆ జీవాహారము క్రీస్తే.
1 కొరి 10:3; నిర్గమ 16:4; యోహా 6:35
C. ఆత్మసంబంధమైన పానీయము త్రాగిరి, వారి వెంటవచ్చిన ఆ ఆత్మబండ క్రీస్తే.
1 కొరి 10:4; నిర్గమ 17:6
II. హెచ్చరికలుగా ఇశ్రాయేలు వైఫల్యాలు
A. దేవుడు వారిలో అనేకులయందు సంతోషింపలేదు కాబట్టి చెడ్డవాటిని ఆశింపకూడదు.
1 కొరి 10:5-6; సంఖ్యా 11:4, 34
B. బంగారు దూడను చేసుకుని పూజించిన ఇశ్రాయేలీయులవలె విగ్రహారాధకులు కాకూడదు.
1 కొరి 10:7; నిర్గమ 32:4
C. వ్యభిచారము చేయకూడదు, మోయాబు స్త్రీలతో పాపము చేసి అనేకులు కూలిపోయిరి.
1 కొరి 10:8; సంఖ్యా 25:1
D. దేవుని శోధింపకూడదు, సణుగుట వలన నాశనకరమైన శిక్షకు గురియై నశించిరి.
1 కొరి 10:9-10; సంఖ్యా 21:5-6; సంఖ్యా 14:2, 37
III. నేటి సంఘానికి పాఠాలు
A. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగాను బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి.
1 కొరి 10:11
B. తాను నిలిచియున్నానని తలంచుకొనువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
1 కొరి 10:12
IV. శోధనలో దేవుని వాగ్దానం
A. సాధారణమైన శోధనే తప్ప దేవుడు నమ్మదగినవాడు గనుక మితిమించిన శోధన రానియ్యడు.
1 కొరి 10:13; మత్త 4:1-11
B. శోధనను సహించగలుగుటకు శోధనతోపాటు తప్పించుకొను మార్గమును కలుగజేయును.
1 కొరి 10:13
C. దేవుని ఆత్మీయ సహాయముతో విశ్వాసి సమస్త శోధనలను జయించి నిలబడగలడు.
V. ముగింపు
A. దేవుని ఆశీర్వాదాలు పొంది కూడా పాపంలో పడకుండా, నమ్మదగిన దేవుని సహాయంతో శోధనలను జయిద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: శోధన వచ్చినప్పుడు నా సొంత బలముపై ఆధారపడుతున్నానా? లేక తప్పించుకొను మార్గము చూపే నమ్మదగిన దేవుని సహాయమును కోరుతున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711
వందనములు బాగుంది👍🙏
రిప్లయితొలగించండి