దేవుని వాక్యపు విలువ
దేవుని వాక్యపు విలువ
ఆధార వాక్యము: ప్రసంగి 12:12; హెబ్రీ 4:12
పరిచయం
A. దేవుని వాక్యము సజీవమై, సమస్త శోధనలను జయించే ఆత్మీయ బలము గలది.
I. వాక్యము యొక్క మూలము మరియు శక్తి
A. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దైవజనుల ద్వారా దేవుని వాక్యము వ్రాయబడింది.
2తిమో 3:16; 2పేతు 1:21
B. వాక్యము నలిగిన అంతరంగాన్ని శోధించి సరిచేసే సజీవమైన శక్తి కలిగినది.
హెబ్రీ 4:12
C. మనుష్యుని హృదయమును, జీవిత ప్రవర్తనను పవిత్రపరచి మార్చే శక్తి వాక్యానిదే.
రోమా 12:1-2; యోహా 15:3; యోహా 17:17
II. రక్షణ మరియు వృద్ధిలో వాక్యము పని
A. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలిగి ఆత్మీయ నూతన జన్మ కలుగుతుంది.
రోమా 10:17; 1పేతు 1:23; 1థెస్స 2:13
B. ఆత్మీయ పాల వంటి వాక్యమును అపేక్షిస్తూ రక్షణలో వృద్ధి పొందాలి.
1పేతు 2:2; సామె 4:20-22; 1కొరి 3:1-3
C. వాక్యము మన అడుగులకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా దారి చూపుతుంది.
కీర్త 119:105; యోహా 8:47; 1యోహా 4:1
III. వాక్యము రక్షించి ఓదార్చును
A. దేవునికి విరోధముగా పాపము చేయకుండునట్లు వాక్యమును హృదయములో ఉంచుకోవాలి.
కీర్త 119:11; ఎఫె 6:17; కీర్త 37:31
B. శ్రమలు, బాధల సమయములో దేవుని వాగ్దానములు మనకు ఓదార్పును, బలమును ఇస్తాయి.
కీర్త 119:25; కీర్త 119:50; కీర్త 119:114
C. మానవుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోటి మాట వలన జీవిస్తాడు.
మత్త 4:4; యాకో 1:22
IV. ముగింపు
A. వాక్యము దేవుని శ్వాస, ఆ వాక్యమును గట్టిగా పట్టుకొని జీవితాంతం జీవిద్దాము.
🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుని వాక్యానికి నీ వ్యక్తిగత జీవితంలో ఇస్తున్న విలువ ఎంత?
బర్నబాస్ – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి