వాక్యమును సరిగా విభజించుట ✨
వాక్యమును సరిగా విభజించుట
ఆధార వాక్యము: 2తిమోతి 2:15
పరిచయం
A. దేవుని సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించు సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఉండాలి.
I. సత్యవాక్యమునకు ప్రాముఖ్యత
A. దేవుని సత్యములో నమ్మకముగా నిలిచితే క్రీస్తుతో కూడా జీవిస్తాము.
2తిమో 2:11
B. దేవుని యెదుట యోగ్యుడిగా, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నడుచుకోవాలి.
2తిమో 2:15
C. ప్రయోజనం లేని వాదనలకు, వ్యర్థమైన మాటలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి.
2తిమో 2:14,16
II. "సరిగా విభజించుట" అంటే ఏమిటి?
A. దేవుని వాక్యమును స్పష్టముగా, సరళముగా మరియు సరిగా వివరించాలి.
సామె 3:6
B. సువార్త యొక్క నిజమైన సత్యమునకు అనుగుణముగా నడుచుకోవాలి.
గల 2:14
C. వాక్యము యొక్క సందర్భమును బట్టి సూటిగా దేవుని సత్యాన్ని బోధించాలి.
2తిమో 3:16
III. వాక్యాన్ని న్యాయంగా విభజించుటకు పద్ధతులు
A. దేవుని వాక్యమునకు మన సొంత మాటలను కలపకూడదు, తీసివేయకూడదు.
ద్వితీ 4:2; సామె 30:5
B. వాక్యమును చదివేటప్పుడు దాని పూర్వాపర సందర్భమును చూసి అర్థము చేసుకోవాలి.
లూకా 18:22
C. ప్రవచనములను మరియు వాటి నెరవేర్పును సరిగా వేరు చేసి గ్రహించాలి.
1థెస్స 4:16
IV. ముగింపు
A. అంత్యదినమున క్రీస్తు మాటయే మనకు తీర్పు తీర్చును కాబట్టి వాక్యాన్ని సరిగా గ్రహించాలి.
యోహా 12:48
🎯 ఆత్మీయ ప్రశ్న: నేను దేవుని వాక్యమును సందర్భముతో, సరిగా విభజించి చదివి అర్థం చేసుకుంటున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి