నీ మొదట ప్రేమను విడిచి పెట్టితివి
నీ మొదట ప్రేమను విడిచి పెట్టితివి
మూల వాక్యం: ప్రక. 2:4
I. ఎఫెసు సంఘానికి ప్రభువు సందేశం
- A. సంఘాన్ని ప్రభువు ఉద్దేశించాడు
ప్రక. 2:1 — ఎఫెసు సంఘపు దూతకు వ్రాయుము. - B. నిత్యుడైన ప్రభువు
ప్రక. 1:4-5,8,18 — ఆల్ఫాయు ఓమెగయై ఉన్నాడు. - C. సంఘముల మధ్య నడుచువాడు
ప్రక. 1:13,16 — సంఘములను జాగ్రత్తగా చూచుచున్నాడు.
II. ఎఫెసు సంఘము మంచి లక్షణాలు
- A. క్రియలలో విశ్వాస్యత
ప్రక. 2:2 — వారి క్రియలను ప్రభువు ఎరిగెను. - B. దుష్టత్వాన్ని సహించలేదు
ప్రక. 2:2 — చెడ్డవారిని అంగీకరించలేదు. - C. అబద్ధ బోధకులను పరీక్షించారు
ప్రక. 2:2 — తప్పుడు అపొస్తలులను గుర్తించారు. - D. సహనంతో నిలిచారు
ప్రక. 2:3 — ప్రభుని నామముకొరకు శ్రమించారు.
III. అయినా ఒక లోపము ఉంది
- A. మొదటి ప్రేమను విడిచారు
ప్రక. 2:4 — క్రీస్తుపట్ల ప్రేమ తగ్గిపోయింది.
IV. ప్రభువు ఇచ్చిన పరిష్కారం
- A. ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకో
ప్రక. 2:5 — ఎక్కడ నుండి పడితివో గుర్తించు. - B. మారుమనస్సు పొందాలి
ప్రక. 2:5 — మొదటి క్రియలను తిరిగి చేయాలి.
V. ప్రభువు హెచ్చరిక
- A. మారుమనస్సు అవసరం
ప్రక. 2:5 — మారకపోతే దీపస్తంభము తొలగించును. - B. సంఘానికి బాధ్యత ఉంది
ప్రక. 1:20 — దీపస్తంభములు సంఘములను సూచిస్తాయి.
VI. జయించువానికి వాగ్దానం
- A. ఆత్మ మాట వినాలి
ప్రక. 2:7 — సంఘములకు చెప్పినది వినాలి. - B. నిత్యజీవ వాగ్దానం
ప్రక. 2:7 — జీవవృక్ష ఫలము భుజించును.
VII. ముగింపు
- A. మొదటి ప్రేమను కాపాడుకుందాం
ప్రక. 2:4 — క్రీస్తుపట్ల ప్రేమ నిలుపుకుందాం.
ముగింపు: మంచి క్రియలు, సహనము, సత్యబోధ ఉన్నప్పటికీ క్రీస్తుపట్ల మొదటి ప్రేమను కోల్పోకూడదు. ప్రతిదినము ప్రేమను పునరుద్ధరించుకొని ప్రభువుకు విశ్వాసముగా జీవిద్దాం.
క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి