కడగబడిన - పరిశుద్ధపరచబడిన - నీతిమంతులుగా తీర్చబడిన*

కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి

ఆధార వాక్యము: 1 కొరింథీ 6:11

పరిచయం

A. క్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడితివి.

I. కడగబడిన

A. బాప్తిస్మమే మన పాపములను పరిశుద్ధముగా కడిగివేయు దైవిక మార్గము.

అపో 22:16; అపో 18:8

B. కడగబడిన విశ్వాసులతో కూడిన సంఘములో ఏకమనస్సు, ఐక్యత ఉండాలి.

1 కొరి 1:10-17; 1 కొరి 1:5

C. దేవుడు తన సంఘమును వాక్యమనే నీటిస్నానము చేత పవిత్రపరుస్తున్నాడు.

ఎఫె 5:25-27

D. బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తు మరణముతోను భూస్థాపనతోను ఏకమవుతున్నాము.

రోమా 6:1-5; యోహా 19:32-34

II. పరిశుద్ధపరచబడిన

A. ప్రభువైన యేసు నామమున మరియు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డాము.

1 కొరి 6:11

B. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారే అర్పించబడుట ద్వారా మనకు పరిశుద్ధత కలిగింది.

హెబ్రీ 10:10

C. మనము జారత్వమునకు, సమస్త పాపములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము.

1 థెస్స 4:3

III. నీతిమంతులుగా తీర్చబడిన

A. క్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తము వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము.

రోమా 5:9

B. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాక క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతి కలుగును.

గల 2:16; గల 5:6

C. బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకొనుట ద్వారా దేవుని కుమారులుగా మారుతున్నాము.

గల 3:26-27

D. దేవుని ఆజ్ఞలకు లోబడే విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా నిరూపించబడతాము.

యాకో 2:21-24

IV. ఇతర ప్రాముఖ్య అంశాలు

A. రక్షించబడిన విశ్వాసులు పాపమనే అంధకారములో ఇకపై జీవించకూడదు.

యోహా 12:46

B. ఈ యుగ సంబంధియైన దేవత సువార్త ప్రకాశము ప్రకాశించకుండా మనోనేత్రములకు గుడ్డితనం కలిగిస్తుంది.

2 కొరి 4:3-4

C. బాప్తిస్మము పొంది విశ్వాసులు ప్రభువైన క్రీస్తు సంఘములో చేర్చబడుతున్నారు.

అపో 2:38-41; అపో 4:4

D. దేవుని వాక్యమనే సత్యము ద్వారా మన హృదయములు నిరంతరం పరిశుద్ధపరచబడాలి.

యోహా 17:17; 1 పేతు 1:22

E. రక్షించబడిన విశ్వాసులందరూ క్రీస్తు శరీరమైన ఒకే సంఘముగా ఉన్నారు.

1 కొరి 12

F. దేవుని సత్యానికి విధేయులు కాక అనీతికి లోబడువారిపైకి ఉగ్రత వస్తుంది.

రోమా 2:8-9

G. క్రీస్తు నందు మనకు పాపపు దాసత్వము నుండి సంపూర్ణ విడుదల లభించింది.

రోమా 6:18

V. ముగింపు

A. క్రీస్తు రక్తము ద్వారా కడగబడి, వాక్యము చేత పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా జీవిస్తూ రక్షణ కాపాడుకుందాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నేను క్రీస్తు రక్తములో కడగబడి, వాక్యము చేత పరిశుద్ధపరచబడి నీతిమంతునిగా జీవిస్తున్నానా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711

కామెంట్‌లు