పౌలు ప్రకటించిన సువార్త

పౌలు ప్రకటించిన సువార్త

మూలవాక్యము: గలతీ 1:8 — మేము ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్త ప్రకటించిన శాపగ్రస్తుడు


I. పౌలు గత జీవితం మరియు దైవిక పిలుపు

  1. పూర్వపు పరిసయ్య జీవితం, సంఘమును హింసించుట గలతీ 1:13-14; అపొ 22:4-5; 26:4-5, 9-11
  2. దమస్కు మార్గంలో ప్రభువు దర్శనం, పిలుపు అపొ 26:13-15
  3. అన్యజనులకు సాక్షిగా ప్రభువు నియామకం అపొ 26:16-18

II. పౌలు ప్రకటించిన దైవిక సువార్త

  1. దేవుని రక్షణ శక్తి కలిగిన మానుషం కాని సువార్త రోమా 1:1, 16; గలతీ 1:11-12
  2. పరిశుద్ధాత్మశక్తితో కూడిన ఆత్మసంబంధమైన బోధ 1కొరి 2:4, 13
  3. సంకల్పమంతయు ప్రకటిస్తూ తీర్చుకున్న సువార్త ఋణం రోమా 1:14-15; అపొ 20:17, 27
  4. నిందలు, స్వార్థపూరిత బోధల మధ్యే సువార్త పక్షమున నిలుచుట ఫిలి 1:15-17

III. సువార్త కొరకు పౌలు చేసిన త్యాగాలు & హెచ్చరికలు

  1. అన్య సువార్త (మరియొక సువార్త) శాపగ్రస్తులు గలతీ 1:8-9; 2కొరి 4:3-4
  2. బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకునే రక్షణ మార్గం గలతీ 3:26-27; రోమా 6:17-18; 10:13
  3. సువార్త కొరకు అనుభవించిన అనేక శ్రమలు, దెబ్బలు 2కొరి 11:22-27; 2తిమో 2:10
  4. సంఘముల గూర్చిన చింత, మరణానికైనా సిద్ధపడిన మనస్సు అపొ 20:24; 21:13; 2కొరి 11:28
  5. వినుట వలన కలుగు విశ్వాసం, సువార్తికుల ప్రాముఖ్యత రోమా 10:14-17
  6. ధర్మశాస్త్రము మరియు క్రీస్తు నందలి ఆత్మీయ స్వాతంత్ర్యం గలతీ 2:4-5; 1తిమో 1:7-9
  7. క్రీస్తునందు స్థిరపడి, సువార్తకు తగినట్లు నడుచుకోవడం ఫిలి 1:27; కొలొ 2:6-7; 2తిమో 1:7
  8. అంత్యకాలపు అబద్ధ బోధలు, విశ్వాస భ్రష్టత్వముపై హెచ్చరిక 1తిమో 4:1-5; హెబ్రీ 3:12
  9. హితబోధను సహింపక కల్పితకథల వైపు తిరిగే కాలము 2తిమో 4:3-4
  10. ఉచితముగా ప్రకటించి, పరుగు ముగించిన నిశ్చయత 1కొరి 9:18; 2తిమో 4:6; 1తిమో 4:6

IV. ముగింపు

  1. పౌలు శ్రమలు ఓర్చి క్రీస్తు యొక్క సత్య సువార్తను మాత్రమే ప్రకటించాడు.
  2. అన్య బోధలకు లొంగిపోకుండా సువార్త సత్యమందు స్థిరముగా నిలుచుదాం.

క్రీస్తు సంఘం, తిమ్మాయిపాలెం

కామెంట్‌లు