ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారు?

ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారు?

ఆధార వాక్యము: రోమీయులకు 14:7

పరిచయం

A. ఇతరులు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారో, గ్రహిస్తున్నారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

రోమీయులకు 14:7

B. మనకు ఇష్టమున్నా లేకపోయినా, మన చుట్టూ ఉన్నవారు మన ప్రవర్తనను బట్టి మనం ఎలాంటివారమో ఒక అభిప్రాయానికి వస్తారు.

రోమీయులకు 14:7

C. ఇతరులు నన్ను ఏ విధంగా చూడాలని మనం ఆశించాలో కొన్ని ముఖ్యమైన విషయాలను గమనిద్దాం.

రోమీయులకు 14:7

I. ఇతరులు నన్ను ఒక పరిచారకుడిగా/సేవకుడిగా చూడాలి

A. యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక పరిచారకుడిగానే వచ్చారు

మార్కు 10:45

B. మనం యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూ ఇతరులకు పరిచారం చేసేవారిగా ఉండాలి

యోహాను 13:2-17

C. పౌలు కూడా ఒకరికొకరు ప్రేమతో పరిచారకులుగా ఉండడంలోని ప్రాముఖ్యతను వివరించారు

గలతీయులకు 5:13-14

D. నేను ఒక పరిచారకుడిగా ఉండటానికి ఏమి అవసరం?

కృషి / ప్రయాస

గలతీయులకు 6:9-10

సమయము హెచ్చించడం

ఎఫెసీయులకు 5:16

మంచి మనస్సు / సరియైన వైఖరి

మార్కు 10:40-44

II. ఇతరులు నన్ను భారాలు మోసే వ్యక్తిగా చూడాలి

A. మనం ఒకరి భారాలను ఒకరం మోయడానికి నిరాకరిస్తే, దేవునికి నమ్మకమైన పిల్లలుగా ఉన్నట్లు కాదు

గలతీయులకు 6:2

B. ఇతరుల భారాలను ఎలా మోయాలో యేసుక్రీస్తు ఒక గొప్ప ఉపమానం ద్వారా మాదిరి చూపించారు

లూకా 10:30-37

C. మనుషులకు రకరకాల సమయాల్లో, రకరకాల రీతుల్లో సహాయం అవసరమవుతుంది

గలతీయులకు 6:2

D. వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో వారికి సహాయపడే బాధ్యత నుండి మనం తప్పించుకోకూడదు

యాకోబు 1:27

III. ఇతరులు నన్ను దేవుని వాక్యాన్ని బోధించే మంచి బోధకుడిగా చూడాలి

A. ప్రతి క్రైస్తవునికి దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించే బాధ్యత ఉంది

మార్కు 16:15; అపో. కార్యములు 8:4

B. ఇతరులు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం సహాయపడాలి

నెహెమ్యా 8:8

C. వారికి దేవుని వాక్యం చెప్పే ఏకైక అవకాశం మనకే కలిగియుండవచ్చు

అపో. కార్యములు 8:4

D. మనం తెలుసుకోవాల్సినంతగా బైబిలును ఎరిగియున్నామా?

2 తిమోతి 2:15; 1:13

E. మనం కేవలం వినేవారము మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారముగా ఉన్నామా?

యాకోబు 1:22-25

IV. ముగింపు

A. ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం.

రోమీయులకు 14:7

B. వారు మనల్ని మంచిగా చూసినా లేదా చెడుగా చూసినా, అది వారితో మనకున్న సంబంధం మీద మరియు దేవుని ప్రభావం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.

రోమీయులకు 14:7


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph: 8096637711

కామెంట్‌లు