మరణము వరకు నమ్మకముగా ఉండుట

మరణము వరకు నమ్మకముగా ఉండుట... (క్రొత్త నిబంధన ప్రజలు)

ఆధార వాక్యము: ప్రకటన 2:10

పరిచయం

A. మనిషి జీవితమును గూర్చి గ్రంధము ఈ విధముగా తెలియజేసింది: కలవంటిది జీవితము, బహు స్వల్పమైనది, క్షణమాత్రము ఉండేది, మాయమై ఆవిరి వంటిది, అల్పకాలము ఉండేది.

2కోరి 4:16-18; హెబ్రీ 11:24-27; యాకోబు 4:14

I. మరణమునకు ఎవరూ అతీతులు కాదు

A. ఈ లోకంలో ఎంతో మంది దేశాన్ని ఏలిన రాజులు, గొప్ప ధనవంతులు అయిన పేదవాడు అయిన ఎవరు కూడా స్థిరముగా ఈ భూమి మీద ఉండరు.

1దినవృత్త 29:14-17; హెబ్రీ 9:26-27; కీర్త 90:1-10; ప్రసంగి 12:7

B. ఈ భూమి మీద ఏది స్థిరము కాదు అని గ్రహించిన వ్యక్తి - ఈ భూమి మీద ప్రతి విషయములో మరణము వరకు నమ్మకముగా ఉండుటకు జాగ్రత్తపడతారు.

II. మరణము వరకు నమ్మకముగా ఉండాలి అంటే ఏమి చేయాలి

A. నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకోవాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి.

రోమా 8:14; 1పేతురు 4:19

B. దేవుని ఇల్లు అనబడే క్రీస్తు సంఘములో క్రీస్తు వలె- నమ్మకమైన పనివారుగా ఉండాలి.

హెబ్రీ 3:4-6; 1కోరి 4:2

C. భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించాలి.

ఫిలిప్పీ 2:12

D. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉండాలి.

ఎఫెసి 6:22; కొలసి 1:8, 4:7

III. మరణము వరకు నమ్మకముగా ఉండి దీవెనకు పాత్రులుగా ఉన్న భక్తులు

A. క్రీస్తు మరణము వరకు నమ్మకముగా ఉన్నాడు.

హెబ్రీ 3:2-4

B. అపోస్తులుడైనా పౌలు నమ్మకమైనవానిగా ఎంచ బడెను.

1తిమో 1:12

C. తిమోతి & తీతు అనే యవన సువార్తికులు ప్రభు పనిలో ఎంతో నమ్మకస్థులు.

1కోరి 4:17; 1తిమోతి 1:2-4

D. తుకికు నమ్మకమైన సువార్తికుడు.

కొలస్సీ 4:8

E. ఎపప్రా నమ్మకమైన పనివాడు.

కొల 1:8

F. సిల్వా నమ్మకమైన పనివాడు.

1పేతురు 5:12

IV. ముగింపు

A. క్రీస్తు పాలన క్రింద ఉన్న క్రొత్త నిబంధన ప్రజలు, సువార్తికులు మరణము వరకు నమ్మకముగా ఉండాలి.

B. మరణము వరకు నమ్మకముగా ఉన్న వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి.

సామెతలు 28:20

C. మరణము వరకు నమ్మకముగా ఉన్నవానికి జీవ కిరీటము ఉంటుంది.

ప్రకటన 2:10


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711

కామెంట్‌లు