ఎప్పుడూ వెనక్కి తగ్గవద్దు


పాఠ్యము: హెబ్రీ 10:35-39

పరిచయం
క్రైస్తవ జీవితంలో హింసలు, శ్రమలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వెనక్కి తగ్గక విశ్వాసముతో ముందుకు సాగవలెను. "మేము వెనక్కి తగ్గువారము కాము" అని హెబ్రీ పత్రిక స్పష్టముగా చెప్పుచున్నది (హెబ్రీ 10:39). వెనక్కి తగ్గువారు నశించిపోదురు, విశ్వాసముతో ముందుకు సాగువారు జీవమును కాపాడుకొందురు. ఈ సందేశములో వెనక్కి తగ్గని వారిని, దేవుని ఆజ్ఞలను, కలుగు లాభములను లేఖనాల వెలుగులో ధ్యానిద్దాం.

I. మేము వెనక్కి తగ్గే వారము కాము
A. మేము వెనక్కి తగ్గే వారము కాము.
(హెబ్రీ 10:35-39)
B. వెనక్కి తగ్గువారు నశించిపోదురు; తగ్గితే క్రైస్తవులము కాము.
C. విశ్వాసముతో ముందుకు సాగువారు జీవమును కాపాడుకొందురు.

II. గ్రంథములో వెనక్కి తగ్గని మనుషుల గూర్చిన వివరాలు
బైబిలు ఉదాహరణలు:
A. దానియేలు: ప్రాణాపాయ స్థితిలో ఆరాధన. ప్రార్థనకు నిషేధం వచ్చెను, 30 దినములు ఎవనినైనా వేడుకొనరాదు. వెనక్కి తగ్గక కిటికీలు తెరచి యెరూషలేము తట్టు ముమ్మారు ప్రార్థించెను. దేవుడు కాపాడెను – దేవుడు సింహముల నోళ్లు మూయించెను.
(దాని 6:7; 6:10; 6:23)
B. యోబు: ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రార్థన. స్నేహితులు విమర్శ సమయంలోను, తమ భార్య దూషించు విషయములోనూ కష్టాలలో వెనక్కి తగ్గక సాగిలపడ్డాడు – యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనెను.
(యోబు 1:20-21)
C. అపొస్తలులు: హింసలోనూ వెనక్కి తగ్గక ప్రకటించారు. కొట్టి యేసు నామమును చెప్పవద్దని ఆజ్ఞాపించిరి, అయినను మానలేదు. మనుష్యులకు కాదు దేవునికే విధేయులము కావలెను.
(అపొ 5:40-42; 5:29)
D. పౌలు: పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. మంచి పోరాటము పోరాడితిని, వెనక్కి తగ్గలేదు.
(1 కొరింథీ 11:1-2; 2 తిమో 4:7; 2 కొరింథీ 11:23-33)
E. దావీదు గోల్యాతుతో యుద్ధము: ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుడైన గోల్యాతుతో యుద్ధం. రాజు మరియు ప్రజలు వెనక్కి తగ్గారు. బాలుడైన దావీదు గోల్యాతుతో యుద్ధంలో వెనక్కి తగ్గలేదు.
(1 సమూ 17:33, 46-51)

III. వెనక్కి తగ్గవద్దని మనుషులకు దేవుని ఆజ్ఞలు
A. ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి.
(యోహాను 4:24; నిర్గమ 20:3-4)
B. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
(నిర్గమ 20:3-4; కొలొస్సి 3:5)
C. మీ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి.
(రోమా 12:1-2)
D. వాక్యము ప్రకటించండి – సమయమందు అసమయమందు ప్రకటించుము.
(2 తిమో 4:2)
E. క్రీస్తు అడుగుజాడలలో నడుచుకొనుడి.
(1 పేతు 2:21; 19-24)
F. ఎప్పుడు వెనక్కి తగ్గవద్దు.
(హెబ్రీ 10:39)

IV. ఎప్పుడు వెనక్కి తగ్గని మనుషులకు కలుగు లాభములు
A. అంతము వరకు సహించినవాడు రక్షింపబడును.
(మత్త 24:13)
B. శోధన సహించువాడు ధన్యుడు; అతడు జీవకిరీటము పొందును.
(యాకోబు 1:12)
C. మరణము వరకు నమ్మకముగా ఉండువారికి జీవకిరీటము ఇవ్వబడును.
(ప్రకటన 2:10)
D. సహించువారు క్రీస్తుతో కూడ ఏలుదురు.
(2 తిమో 2:12)
E. మన ఆశ్రయమును విడువక ఓపికతో నిలిచినవారు వాగ్దానమును పొందుదురు.
(హెబ్రీ 10:36)

అన్వయము
హింసలలో, శ్రమలలో వెనక్కి తగ్గక, విశ్వాసముతో దేవుని ఆజ్ఞలకు లోబడి క్రీస్తు అడుగుజాడలలో నడుచుకొనవలెను (1 పేతు 2:21; 19-24).

ముగింపు: వెనక్కి తగ్గువారు నశించిపోదురు; విశ్వాసముతో ముందుకు సాగువారు జీవమును కాపాడుకొందురు. కాబట్టి దానియేలు, యోబు, అపొస్తలుల వలె ఎప్పుడును వెనక్కి తగ్గక అంతము వరకు నిలిచియుందాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నా జీవితంలో హింసలు, శ్రమలు వచ్చినప్పుడు నేను వెనక్కి తగ్గుచున్నానా, లేక విశ్వాసముతో ముందుకు సాగుచున్నానా?

కామెంట్‌లు